సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే దాసరి.

అగ్నిధారన్యూస్( సుల్తానాబాద్ ):పెద్దపల్లి నియోజకవర్గంలోని సుల్తానాబాద్ మండలం కందునూరిపల్లి గ్రామంలో బుధవారం రోజు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ  నిధుల ద్వారా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి 20రూ: లక్షలతో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు తీసుకురావడంతోపాటు, గ్రామాలలో మౌలిక వసతులను అభివృద్ధి పరచడం కోసం, అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. గ్రామాల్లోని అంతర్గత రోడ్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఏళ్ల తరబడి మట్టి రోడ్లతో బురద మయమైన గ్రామాలలు నేడు  సి సి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నామన్నారు.  ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలాజీ రావు,AMC ఛైర్మెన్ బుర్ర శ్రీనివాస్,KDCC డైరక్టర్ సిరిగిరి శ్రీనివాస్, సర్పంచ్ స్వరూప తిరుపతి, ఎంపీటీసీ సంపత్ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ ముఖ్యం సునీత రమేష్, తెరాస పట్టణ అధ్యక్షులు గునపతి, ఉప సర్పంచ్ పద్మా కొమురయ్య , తదితరులు పాల్గొన్నారు.