లయన్స్ క్లబ్ ఆఫ్ శ్రీశక్తి ఆధ్వర్యంలో ప్రపంచ ఆప్టోమెట్రిస్ట్ దినోత్సవం
అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి ):పెద్దపల్లి బండారికుంట మైత్రి కాలనీ సుధా హోమ్స్ కార్యాలయంలో లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి శ్రీ శక్తి ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ ఆప్టోమెట్రిస్ట్ దినోత్సవం నిర్వహించారు.మార్చ్ 23 ప్రపంచ ఆప్టోమెట్రిస్ట్ దినోత్సవం పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆఫ్ శ్రీ శక్తి అధ్యక్షురాలు లయన్ విజయగిరి సుధా బుధవారం ఆప్టోమెట్రిస్ట్ లు లయన్ పూదరి దత్తాగౌడ్, లయన్ అబ్దుల్ వాసే,లయన్ బూతగడ్డ చందు,వేల్పుల రమేష్ ను ఘనంగా సన్మానించారు.ఆప్టోమెట్రిస్ట్ లు పేద ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు,ఉచిత కంటి శస్త్ర చికిత్సలు నిర్వహించి అందరికి చూపు ప్రసాధిస్తున్నారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ తెలంగాణ ఐ కేర్ అధ్యక్షులు లయన్ పూదరి దత్తాగౌడ్, లయన్ అబ్దుల్ వాసే,భూతగడ్డ చందు,రమేష్ పాల్గొన్నారు.