ఎమ్మెల్యే ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన ముదిరాజ్ సంఘం నాయకులు.
తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తోoది.
మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం.
నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడమే లక్ష్యం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.
అగ్నిధారన్యూస్( జగిత్యాల ) జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కొత్తపేట ముదిరాజ్ సంఘము పెద్దమ్మ తల్లీ గుడి నిర్మాణానికి ఎండోమెంట్ ద్వారా 9,89,823/ లక్షల రూపాయలు మంజూరుకు ,ఎమ్మేల్యే డా. సంజయ్ కుమార్ కృషి చేయగా శుక్రవారం రోజు ఉదయం జగిత్యాల ఎమ్మేల్యే క్వార్టర్స్ లో ముదిరాజ్ సంఘ నాయకులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… పెద్దమ్మ దేవాలయానికి నిధులు విడుదలకు కృషి చేసినందుకు ముదిరాజ్ కులస్తులు ఎల్లవేళలా రుణపడి ఉంటామన్నారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ…… తెలంగాణ ప్రభుత్వం ప్రజాసంక్షేమం కోసం అన్ని కులాల, మతాల, అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తోందన్నారు. రాబోయే రోజులలో నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడిపించే దిశగా ముందుకు వెళ్తున్నాం అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మందుల శ్రీనివాస్, మాజీ నాగాలయకమిటి చైర్మన్ మందుల నరేష్ ముదిరాజ్ సంగం అధ్యక్షులు బక్కన్న మహేష్ ,గంగారెడ్డి,శ్రీనివాస్, నారాయణ,నర్సయ్య,అంజయ్య, లచ్చయ్య నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
