అగ్నిధారన్యూస్ (మంచిర్యాల)
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాల ప్రధాన రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. రాజస్థాన్ ఛత్తీస్గడ్ రాష్ట్రాల నుండి వెళ్తున్న రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా ప్రధాన రహదారిపై జరిగిన ఈ ప్రమాదంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారు.