పెద్దపల్లి జిల్లా ఎంపీఓలతో గూగుల్ జూమ్ వీడియో కాన్ఫరెన్స్.

 హరితహారం మొక్కల పరిరక్షణ పై ప్రత్యేక దృష్టి సారించాలి.

పల్లె ప్రగతి  కార్యక్రమానికి సన్నద్ధమై ఉండాలి.

తడి చెత్త పొడి చెత్త వేరు చేసి వర్మీ కంపోస్ట్ తయారు చేయాలి.

ప్లాస్టిక్ రహిత పరిశుభ్ర గ్రామాలుగా ఉండాలి జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి.

అగ్నిధారన్యూస్పెద్దపెల్లిజిల్లా )గురువారం రోజు పెద్దపెల్లి జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి జిల్లాలోని 13 మంది మండల పంచాయితీ అధికారులతో గూగుల్ ( జూమ్ ) మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. జిల్లాలోని ప్రతి గ్రామం ప్లాస్టిక్ రహిత గ్రామంగా పరిశుభ్రమైన గ్రామంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. మొక్కల పెంపకంపైన ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.వేసవికాలం దృష్ట్యా హరితహారంలో పెట్టిన మొక్కలకు గ్రామపంచాయతీ ట్యాoకర్ ద్వారా నీళ్లు పోయారన్నారు. జూన్లో నిర్వహించ తలపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమానికి సన్నద్ధం కావాలని సూచించారు. గ్రామంలో ప్రతిరోజు మల్టీ పర్పస్ వర్కర్ల ద్వారా దుకాణ సముదాయాల వద్ద ప్రజలు  గుమిగూడె ప్రదేశాల వద్ద దేవాలయాల వద్ద  రద్దీ ప్రదేశాలలో జాతరలు, వేడుకల వద్ద  సేకరించిన ప్లాస్టిక్ ని  అమ్మి వేయాలని ఆదేశించారు.ఈ విషయమై  మండలాల వారీగా ప్రతి నెల రెండు వేల నుండి ఐదు వేల విలువచేసే ప్లాస్టిక్ ను సేకరించి  అమ్మే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. తద్వారా వచ్చిన డబ్బులు గ్రామ పంచాయితీ అవసరాలకే వినియోగించాలన్నారు. ఇలా చేయడంవల్ల గ్రామాలలో ప్లాస్టిక్   లేకుండా పరిశుభ్రమైన గ్రామంగా తయారవుతుంది అన్నారు. రాబోయే రోజుల్లో గ్రామాలు, మండలాలు, జిల్లా, ప్లాస్టిక్ రహిత పచ్చదనంతో కూడిన పరిశుభ్ర జిల్లాగా పేరు తేవడంలో గ్రామపంచాయతీ కార్యదర్శులు, పాలకవర్గాలు, ప్రజలు, కీలక పాత్ర వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డి ఎల్ పి ఓ రాంబాబు ,రజాక్ ఎంపీవోలు సుదర్శన్, గోవర్ధన్, ఫయాజ్ ,కిరణ్  ,భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.