సిసి రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దాసరి అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ) పెద్దపల్లి మండలం కాపులపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా సోమవారం రోజు అంతర్గత సీసీ రోడ్ల (12 లక్షల) పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నానన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు తీసుకువచ్చి మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానన్నారు. గతంలో బురద మయమైన గ్రామాల అంతర్గత రహదారులు క్రమక్రమంగా సిసి రోడ్లు వేసి పరిశుభ్ర గ్రామాలుగా తీర్చిదిద్దే కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు మార్కు లక్ష్మణ్, సర్పంచ్ గోపు కవిత-శ్రీనివాస్, ఉప సర్పంచ్ అశోక్,గ్రామ శాఖ అధ్యక్షులు చంద్రమోగిళి, రైతు బంధు గ్రామ కో ఆర్డినేటర్ తిరుపతి రెడ్డి,గ్రామ పాలకవర్గం,తెరాస నాయకులు రాజిరెడ్డి, లస్మయ్య,రాజేశ్వర్ రెడ్డి, కోట మల్లారెడ్డి,రామచంద్రు, కొమురయ్య,కుమార్, రవి,కనకయ్య, కార్యకర్తలు,ప్రజా ప్రతినిధులు,రైతులు తదితరులు పాల్గొన్నారు.

