అగ్నిధార న్యూస్ ( పెద్దపల్లిజిల్లా ) పెద్దపల్లిజిల్లా పెద్దపల్లి పట్టణ కేంద్రంలో తెల్లవారుజామున రెండు గంటల 15 నిమిషాలకు ఆర్టీసీ బస్సు, సూపర్ లగ్జరీ లారీని ఢీకొన్న సంఘటనలో నలుగురి ప్రయాణికులకు పాక్షిక గాయాల పాలయ్యారు మంచిర్యాల ఆర్టిసి డిపో మేనేజర్ రవీంద్రనాథ్ చెప్పిన వివరాల ప్రకారం తెల్లవారుజామున మంచిర్యాల నుండి హైదరాబాద్ కు ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సు పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ సమీపంలో ముందుగా వెళ్తున్న లారీ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వెనకాలే వస్తున్న బస్సు ఒక్కసారిగా ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ప్రమాదంలో పాక్షిక గాయాలతో ప్రయాణికులు డ్రైవర్ బయట పడ్డారు.ఈ సంఘటన తో పెను ప్రమాదం చెప్పినట్లయింది.వెంటనే స్పందించిన గోదావరిఖని డిపో మేనేజర్ ప్రయాణికులకు మరొక బస్సు ఏర్పాటుచేసి గమ్యస్థానాలకు పంపించారు.
