■ ప్లాస్టిక్ కవర్లు వాడితే జరిమానాలు,కఠిన చర్యలు.
■ పట్టణములో భారీ అవగాహన ర్యాలీ.
■ యజమానులు వినియోగదారులు సహకరించాలి.
💐💐 ఫోటో కొట్టు-గిఫ్ట్ పట్టు💐💐
■ కమిషనర్ తిరుపతి చైర్ పర్సన్ దాసరి మమత రెడ్డి.
■ ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే దాసరి.
అగ్నిధారన్యూస్( పెద్దపల్లిటౌన్ ) సోమవారం రోజు పెద్దపల్లి పట్టణంలో కేంద్రంలో స్థానిక బస్టాండ్ వద్ద నుండి అంబేద్కర్ చౌరస్తా మీదగా జెండా చౌరస్తా వరకు పెద్దపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ మమతా రెడ్డి మున్సిపల్ కమిషనర్ తిరుపతి ఆధ్వర్యంలో ప్లాస్టిక్ కవర్ల నిషేధంపై ఒగ్గు డోలు కళాకారులు, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక కళాకారులు, కోలాటాల మహిళల బృందంచే భారీ ఎత్తున అవగాహన ర్యాలీ నిర్వహించారు ఇట్టి కార్యక్రమనికి ముఖ్య అతిథిగా స్థానిక శాసన సభ్యులు దాసరి మనోహర్ రెడ్డి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈసందర్భంగా చైర్ పర్సన్ మమతా రెడ్డి,కమిషనర్ తిరుపతి మాట్లాడుతూ….. భారత ప్రభుత్వ పర్యావరణ అటవీ , వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ద్వారా జి ఎస్ ఆర్ 571( బి)12 ఆగస్టు 2021 నోటిఫికేషన్ ప్రకారం 120 మైక్రన్స్ కన్నా తక్కువ మందం గల ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు ఒక్కసారి మాత్రమే వినియోగించగల ప్లాస్టిక్ వస్తువులను నిషేధించడం జరిగింది అన్నారు ఇట్టి విషయంపై దుకాణ యజమానులు సహకరించలని సూచించారు లేని యెడల దుకాణ యజమానులకు వినియోగదారులకు జరిమానాలు విధించడం జరుగుతుంది హెచ్చరించారు.
ఫోటో కొట్టు-గిఫ్ట్ పట్టు
సరికొత్త సందేశాన్ని పెద్దపల్లి మున్సిపల్ శాఖ ప్రజల ముందుకు తీసుకారవడం జరిగింది చుట్టుపక్కల వారు కానీ మీకు ఎక్కడైనా రోడ్డుపైన మురికాలువలో చెత్త వేస్తున్నప్పుడు మీరు ఒక్క ఫోటో తీసి మున్సిపల్ కార్యాలయం వారు ఏర్పాటుచేసిన. వాట్స్ అప్ నంబర్ 63099999940 నెంబర్ కి పంపినట్లయితే స్వయంగా నేనే మీవద్దకు వచ్చి ప్రోత్సాహక 500/-రూపాయల బహుమతి అందచేయడం జరుగుతుందని మున్సిపల్ చైర్ పర్సన్ మమతా రెడ్డి తెలిపారు అదేవిధంగా పెద్దపల్లి ప్రజలు మార్కెట్ వెళ్ళినప్పుడు ముందస్తు జాగ్రత్తగా వెంట బట్టసంచులు తీసుకవేళ్ళాలని సూచించారు. ఈకార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ నజీమీన్ సుల్తానా మోబిన్ , అన్ని వార్డుల కౌన్సిలర్లు,కో అప్షన్ సభ్యులు, ,మేనేజర్ శివప్రసాద్ ,ఆఫీసు సిబ్బంది,శానిటేషన్ సిబ్బంది మరియు మెప్మా మహిళలు పాల్గొన్నారు.
