అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లిజిల్లా )రామగుండం కమిషనరేట్ మంగళవారం రోజు పెద్దపల్లి ఏసిపి కార్యాలయ ఆవరణలో డిసిపి అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలు తెలిపారు.పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్ పరిధిలో పెద్దపల్లి ఎస్ ఐ రాజేష్ తన సిబ్బందితో కలిసి వాహనానికి చేస్తుండగా నేదునూరి శ్రావణ్ 27 సంవత్సరాలు రంగంపల్లి. అనే వ్యక్తి ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు పెద్దపల్లిలో పలు ప్రాంతాల్లో జలసాల కోసం ఈజీ మనీకి అలవాటు పడి దొంగతనాలు చేస్తూ పలుమార్లు జైలు జీవితం గడిపిన అతనిని మార్పు జరగలేదు అన్నారు. ఆరు బైకులు బంగారం స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు ప్రతి ఒక్క వాహనదారు వాహనాలను భద్రంగా చూసుకోవాలన్నారు. దొంగతనాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరైనా ఇంటికి తాళం వేసి ఊర్లోకి వెళ్లే క్రమంలో రోజుల తరబడి వెళ్ళినట్లయితే పోలీస్ శాఖ వారికి సమాచారం ఇచ్చి వెళ్లాలన్నారు. ఈ సందర్భంగా దొంగను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందికి రివార్డులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఏసిపి సాదుల సారంగపాణి సిఐ ప్రదీప్ కుమార్ ఎస్ ఐ లు రాజేష్ ,మౌనికతదితరులు పాల్గొన్నారు.
