జూన్ 23వ తేదీన అగ్నిధార పత్రికలో ప్రచురితమైన కథనం.

అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లిజిల్లా ) జూన్ 23వ తేదీన అగ్నిధార పత్రికలో కమాన్ పూర్ మండల కేంద్రంతో పాటు గ్రామాలలో అపరిశుభ్రంగా ఉన్న పరిసరాల పైన కమాన్ పూర్ మండలంలో కానరాని పారిశుద్ధ్యం అనే శీర్షికతో ప్రత్యేక కథనం ఇవ్వడం జరిగింది. కథనానికి స్పందించిన జిల్లా పంచాయతీ ఉన్నత అధికారి అయిన డిపిఓ చంద్రమౌళి 23 జూన్ రోజున కమాన్ పూర్ ఎంపీఓ ఆరిఫ్ కు కమాన్ పూర్ లో కానరాని పారిశుద్ధ్యం…. పడకేసిన పారిశుధ్యం పట్టించుకోని పంచాయతీ అధికారులు .డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం చెత్త సేకరణలలో పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం పందుల స్వైర విహారం అంశాల పైన MEMO జారీ చేశారు. తదనంతరం 25వ తేదీన కమాన్ పూర్ మేజర్ గ్రామపంచాయతీని ఆకస్మికంగా తనిఖీ చేసి ఆయా ప్రాంతాలను పరిశీలించారు. తన సందర్శనలో కమాన్ పూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజ్యలక్ష్మి కి కూడా మెమో జారీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి మాట్లాడుతూ… జిల్లాలో గ్రామ పంచాయతీలన్నీ పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సూచించారు వర్షాకాలన్ని దృష్టిలో ఉంచుకొని సీజనల్ వ్యాధుల నుండి ప్రజలను రక్షించాలంటే గ్రామపంచాయతీలు కచ్చితంగా శుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామపంచాయతీ వాహనాలను వినియోగించి తడి చెత్త పొడి చెత్త ప్రతిరోజు వేరు చేస్తూ డంపింగ్ యార్డ్ కు తరలించాలని సూచించారు. ప్లాస్టిక్ కవర్లు వాడకాన్ని తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. గతంలో హరితహారం కింద నాటించిన మొక్కలను, నాటించబోయే మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత గ్రామపంచాయతీదే అన్నారు. జిల్లాలో ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా ఉండేలా ఆయా మండలాల పంచాయతీ అధికారులు పంచాయతీ కార్యదర్శులు చర్యలు చేపట్టాలని హెచ్చరించారు.
