■  14,17 వార్డులలో బోర్ వెల్స్ ప్రారంభించిన  మమతా రెడ్డి.

■  పాల్గొన్న మున్సిపల్  కమిషనర్ తిరుపతి కౌన్సిలర్లు.

అగ్నిధారన్యూస్( పెద్దపల్లిటౌన్ ) పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పట్టణ ప్రగతిలో భాగంగా వార్డుల సందర్శన కార్యక్రమంలో గతంలో మంచినీటి సమస్య తమ దృష్టికి రాగ వెంటనే స్పందించిన మున్సిపల్ చైర్ పర్సన్ మమతారెడ్డి బాల వికాస స్వచ్ఛంద సంస్థ వారితో మాట్లాడి  రెండు మంచి నీటి చేతి పంపులను మంజూరు చేయించి గురువారం రోజు పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ సిహెచ్ తిరుపతి తో కలిసి 14వ వార్డు  17వ వార్డుల లో బోర్ వెల్స్ ప్రారంభించి ఆయా వార్డు ప్రజలకు మంచినీటి సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈసందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ పట్టణ ప్రగతి లో అన్ని వార్డులో అన్ని సమస్యలను గుర్తించడాం జరిగింది అని అన్ని సమస్యలను విడతలవారీగా పరిష్కరించడాం జరుగుతుంది అన్నారు పట్టణంలో ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకవచ్చినట్లయితే తప్పకుండా  పరిశీలిస్తామన్నారు  అలాగే పెద్దపల్లి పట్టణాన్ని స్వచ్ఛ పెద్దపల్లిగా తీర్చే క్రమంలో ప్రజలందరూ సహకరించలని ప్లాస్టిక్ కవర్లను బహిష్కరించలని బట్టసంచులను వాడాలని అన్నారు ప్రతి రోజు ఇంట్లో వెళ్లే చెత్తను మురికాలువలో వేయకుండా మున్సిపల్ రిక్షాకు అందియాలని అన్నారు ఈసందర్భంగా అడుగగానే స్పందించిన బాల వికాస స్వచ్ఛంద సంస్థ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈకార్యక్రమంలో.   14వ వార్డు కౌన్సిలర్ షాహీదా సబీర్ ఖాన్,17వ వార్డు కొలిపాక సంధ్య చిరంజీవి 3వ వార్డు కౌన్సిలర్ భిక్షపతి, 13వార్డు కౌన్సిలర్ పాగాల సోనీ శ్రీకాంత్,దేవరాజ్,మేనేజర్ శివప్రసాద్,ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కొలిపాక నర్సయ్య, బాల వికాస ప్రతినిధి ప్రశాంత్,సానిటరీ ఇన్స్పెక్టర్ రామ్మోహన్ రెడ్డి,బిల్ కలెక్టర్ సతీష్,హరితహారం ఇంచార్జ్ అనిల్, మసీయోద్ధిన్,వార్డు ప్రజలు పాల్గొన్నారు.