■ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఎమ్మెల్యే దాసరి.
■ ఆలయ అభివృద్ధికి కృషి చేయాలి.
■ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన మేకల మల్లేశం యాదవ్.
అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ) సుప్రసిద్ధ దైవ క్షేత్రం ఓదెల మల్లిఖార్జున స్వామి దేవాలయాన్ని అని రంగాల్లో అభివృద్ధి పరచాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఓదెల మల్లిఖార్జున దేవస్థానం ఆలయ కమిటీ ఛైర్మెన్ గా మేకల మల్లేశం యాదవ్ బాధ్యతలు చేపట్టగా తనతో పాటు ధర్మకర్తలు గా చింతం వెంకటస్వామి,మూడేత్తుల శ్రీనివాస్, మ్యాడగోని శ్రీకాంత్, కనికిరెడ్డి సతీష్, బత్తుల రమేష్, దుగ్యాల నర్సింగరావు, పరిపాటి నరేందర్ రెడ్డి,ఆరెల్లి మొండయ్య, రౌతు స్వర్ణలత, , కర్రె కుమారస్వామి, , దూపం భద్రయ్య లతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలన్నారు,ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేణుకాదేవి, PACS ఛైర్మెన్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి, మారం తిరుపతి యాదవ్, శ్రీనివాస్ ,మండల పార్టీ అధ్యక్షుడు ఐరెడ్డి వెంకట్ రెడ్డి, రైతు బంధు మండలాధ్యక్షుడు కావేటి రాజు, ఆలయ మాజీ ఛైర్మెన్ ఆళ్ల రాజిరెడ్డి,ఆకుల మహేందర్, పర్వతాలు, ఎంపీటీసీ లక్ష్మీ -కుమారస్వామి, ఎంపీపీ లు, జడ్పీటీసీ లు , మండల సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, ఉప సర్పంచ్ లు, గ్రామ శాఖ అధ్యక్షులు,మాజీ ప్రజా ప్రతినిధులు,తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

