అగ్నిధారన్యూస్( పెద్దపల్లి క్రైమ్ )పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం సబితం గ్రామం పరిధిలోని గట్టుసింగారం వద్ద గల వాటర్ ఫాల్స్ లో రాజస్థాన్ కు చెందిన సర్వాన్ 25 అనే వ్యక్తి వాటర్ఫాల్ సందర్శనకు వచ్చి నీటిలో మునిగి చనిపోయినట్లు బసంత నగర్ ఎస్ ఐ మహేందర్ యాదవ్ తెలిపారు. మృతుడు బతుకుదెరువు కోసం పెద్దపల్లిలో జగదీష్ అనే వ్యక్తి వద్ద రేలింగి వర్క్ చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడని తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకొని బసంత్ నగర్ ఎస్ఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.