అగ్నిధారన్యూస్( పెద్దపల్లి క్రైమ్ )పెద్దపెల్లి పట్టణంలోని శాంతినగర్ లోని కెనాల్ కాలవాటు పక్కన ఉన్నటువంటి పవర్ పోల్ మీద విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా 11 కెవి తాకి జావిద్ జూనియర్ లైన్మెన్ మృతి చెందిన సంఘటన జిల్లా కేంద్రంలో ఒక్కసారి కలకలం సృష్టించింది. గోదావరిఖనికి చెందిన జావిద్ ఉద్యోగరీత్యా పెద్దపల్లిలో విధులు నిర్వహిస్తున్నాడు మంగళవారం రోజు పెద్దపల్లిలో విద్యుత్ మరమ్మత్తులు చేస్తుండగా 11 కెవి వైర్ తగిలి కరెంట్ పోల్ పై నుండి ఒకసారి గా కింద పడిపోగా తీవ్ర గాయాల పాలు కాగా  కరీంనగర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు పలువురు నాయకులు విద్యుత్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా  ప్రమాదం జరిగిందని ఆరోపించారు.  ప్రొద్దున జరిగిన సంఘటనను సాయంత్రం వరకు విచారణ చేపట్టకుండా నిర్లక్ష్యం వహించిన విద్యుత్ శాఖ అధికారుల మీద  ఆగ్రహం వ్యక్తం చేశారు.మృతుడి  తండ్రి ఎండి బందేలి ఫిర్యాదు మేరకు పెద్దపల్లి ఎస్ ఐ రాజేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.