అగ్నిధార న్యూస్, పెద్దపల్లి :
పాఠశాలకు రంగులు.
మండలంలోని పాలితం గ్రామ పంచాయతీ అనుబంధ పుట్టపల్లిలో లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ ఆద్వర్యంలో శనివారం పాఠశాలకు రంగులు వేశారు. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల కి సహాయం అందించడం లో లయన్స్ క్లబ్ ఎలైట్ ముందుంటుందనీ, ఇప్పటికి వరకు వివిధ పాఠశాలలకు 190 బెంచీలు, 5 టీవీలు అందించమన్నారు. 2 స్కూల్స్ కి రంగులు వేయించామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సెక్రటరీ సంపత్ రావు, డైరెక్టర్ గుజ్జుల కుమార్ ,లింగరావు తదితరులు పాల్గోన్నారు.
