అగ్నిధార న్యూస్ పెద్దపల్లి
దేశానికి రైతేవెన్నుముక పండించిన పంటను అమ్ముకున్నాడు , రైతుకు సరైన నా మద్దతు ధర లభించినప్పుడు రైతు కళ్ళలో ఆనందమేవేరు రైతులకు ఈ ఆనందం అనేది ప్రతి ఆరు నెలలకు ఒకమారు కనబడుతుంది వరి పొలాలు పత్తిచెళ్లు ప్రధానాధారంగా వంటలు వేసుకుంటూ పెద్దపల్లి జిల్లా వాసులు వ్యవసాయం కొనసాగిస్తారు ఉంటారు రైతు ఆనందంగా తన పంటలను అమ్ముకొనే సీజన్ మొదలయ్యింది సోమవారం పెద్దపల్లి లి లి జిల్లా పెద్దపల్లి మండలం వ్యవసాయ మార్కెట్ లో పత్తి ధర రికార్డు స్థాయిలో 7960 రూపాయలు అత్యధికంగా ధర పలికింది పెద్దపల్లి లోని 21సూర్య కాటన్ ట్రేడర్స్ కొనుగోలు చేశారు.
అత్యల్పంగా 7400 రూపాయలు పత్తికి మద్దతు ధర పలికారు ఈ సందర్భంగా అగ్నిధార న్యూస్ తో అప్పన్న పేట్ సబ్బితం ఛందపల్లి భోజన పేట గ్రామాలకు చెందిన రైతులు. పిడుగు శ్రీనివాస్ జంగంపల్లి కనకయ్య కందుల తిరుపతి గుర్రాల వెంకటేశం కుడుదుల మల్లయ్య తోట సంతోష్ మాట్లాడుతూ రైతులకు పెట్టుబడులు వ్యవసాయ కూలీల రేట్లు బాగా పెరిగాయి అన్నారు అదేవిధంగా ఎకరానికి అనుకున్నంతగా పత్తి వచ్చే పరిస్థితి లేకున్నప్పటికీ ఈరోజు రైతుకు కల్పించిన మద్దతు ధర సంతోషాన్ని ఇచ్చిందన్నారు పత్తి ధర ఇలాగే కొనసాగి నట్లయితే బాగుంటుందని ఆకాంక్షించారు

