అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి:
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు…..
పెద్దపల్లి రూరల్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు నిర్వహించారు . పెద్దపల్లి లో సోమవారం ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. కరోనా నేపథ్యంలో మార్చి లో జరగాల్సిన పరీక్షలు అక్టోబర్ నిర్వహించారు. కరోన కారణం తో కాలేజీలు ఆలస్యంగా ప్రారంభం అయ్యాయి. కానీ సీనియర్ ఇంటర్ తరగతులు ప్రారంభించారు. వెంటనే ప్రభుత్వం ఫస్టియర్ పరీక్షలు నిర్వహించాలని ఉత్తర్వులు జారీచేసింది. దీనితో తల్లిదండ్రుల తోపాటు విద్యార్థుల్లో తొలుత కలవరం మొదలైంది. కరోనా సమయంలో పరీక్షలు ఎలా నిర్వహిస్తారని తల్లిదండ్రుల్లో వ్యతిరేక త వచ్చింది. పరీక్షలు రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.పరీక్షల నోటిఫికేషన్ వచ్చిన జోక్యం చేసుకోవడం సరికాదని పిటిషన్ కోటివేసింది. దీనితో పరీక్షలు అనివార్యం అయ్యింది. కరోనా నిబంధనలు పాటిస్తూ నిర్వహించాలని ఆదేశించింది. పరీక్ష కేంద్రం వద్ద టెంపరేచర్ పరీక్షలు నిర్వహించి సానిటేషన్ చేస్తూ విద్యార్థులు పరీక్ష హాల్లోకి పంపారు.ప్రతి ఒక్కరూ మాస్కు లు ధరించే విధంగా కేంద్రాల వద్ద చర్యలు తీసుకున్నారు. అలాగే విద్యార్థులకు కేంద్రాల వద్ద మంచినీటి సమస్య లేకుండా చూశారు.
