అగ్ని ద్వారా న్యూస్ ,కరీంనగర్:
ఈ రోజు హుజురాబాద్ ఉప ఎన్నికలలో భాగంగా జమ్మికుంట మండలం మాచనపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టి అభ్యర్థి బల్మూరు వెంకట్ చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరుతూ ఇంటింటికి ప్రచారం చేసిన మాజీ మంత్రి మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ,పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు , రామగుండం ఇంఛార్జి రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మాట్లాడుతూ బల్మూర్ వెంకట్ యువకుడు ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉండే దమ్మున్న యువ నాయకుడు అన్నారు వెంకట్ ని అసెంబ్లీకి పంపినట్లయితే హుజరాబాద్ ప్రాంత ప్రజలకు అండగా ఉండి మీ పక్షాన అసెంబ్లీలో మాట్లాడుతాడు అన్నారు.
పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ మాచనపల్లి గ్రామస్తులు అందరూ ఒక తాటిపైకి వచ్చి బల్మూర్ వెంకట్ కి ఓటు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు టిఆర్ఎస్ పరిపాలనను చూశారు ఈటల రాజేందర్ పరిపాలన చూశారు ఒకసారి యువకుడైన బల్మూర్ వెంకట్ ని గెలిపించి చూడండి కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ అండగా ఉంటుంది అన్నారు.
రామగుండం నియోజకవర్గ ఇంచార్జ్ రాజ్ ఠాగూర్ మక్కన్ సింగ్ మాట్లాడుతూ టిఆర్ఎస్ బిజెపి ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అన్నారు తెలంగాణ ఇచ్చిన పార్టీ టీ.కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థి నీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు.
