అగ్నిధార న్యూస్, పెద్దపల్లి:
పెద్దపల్లి మండలం లోని బోజన్నపేట గ్రామంలో sdf నిధుల నుండి 23 లక్షల వ్యయం తో నిర్మిస్తున్న సిసి రోడ్లు జంగా కొమురయ్య ఇంటి వద్ద నుండి ఇప్పన పల్లి నాగభూషణం ఇంటి వరకు నిర్మాణ పనులను సోమవారం రోజున గ్రామ సర్పంచ్ మేకల మల్లేష్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ముంజ సంధ్యారాణి ,సతీష్ గౌడ్ , కాల్వ కొమురయ్య ఆవుల రమేష్ ఏనుగు గిరిoధర్ భయ్య కొమురయ్య సంపత్ పంచాయతీ కార్యదర్శి రమేష్ పాల్గొన్నారు.
