అగ్నిధార న్యూస్, పెద్దపల్లి
జూలపల్లి మండలం వెంకట్రావుపల్లి పాఠశాల విద్యార్థులకు దాతల సహకారంతో కుర్చీలు,ఫ్యాన్లు,ట్యూబ్ లైట్లు,మధ్యాహ్నభోజనానికి గ్యాస్ స్టౌ పంపిణీ
జూలపల్లి ZPTC శ్రీ బొద్దుల లక్ష్మణ్,స్థానిక MPTC పల్లె స్వరూప ప్రసాద్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ మచ్చ యాదగిరి పాఠశాల విద్యార్థులకు ఉపయోగకరమైన కుర్చీలు పంపిణీ చేసారు.
MPTC శ్రీమతి పల్లె స్వరూపప్రసాద్ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులు నేలపై కూర్చుని చదువుకోవడం చూసి విద్యార్థులకు కుర్చీలు ఇవ్వాలని సంకల్పించినట్లు చెప్పారు.మార్కెట్ కమిటీ డైరెక్టర్ మచ్చ యాదగిరి మాట్లాడుతూ తాను చదువుకున్న పాఠశాలకు ఏదైనా చేయాలనే ఆలోచనతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు
భవిష్యత్తులో పాఠశాలకు కావల్సిన సహాయ సహకారాలు అందించడానికి
ముందు ఉంటామన్నారు
ప్రధానోపాధ్యాయులు శ్రీ రామడుగు సత్యనారాయణ మాట్లాడుతూ…
పాఠశాలలో సేవా కార్యక్రమాలనునిర్వహించడం చాలా అభినందనీయమని ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి,శ్రీ రాధా శ్రీనివాస్,ఉప సర్పంచ్ శ్రీమతి,శ్రీ జుట్టు విజయశంకర్,
బడుగు చంద్రయ్య,గ్రామపంచాయితీ కార్యదర్శి సంతోష్ వార్డు సభ్యులు,గ్రామ పెద్దలు,విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయులు
రా మడుగు సత్యనారాయణ, ఉపాధ్యాయ బృందం
తునికి అశోక్ రాజు,శ్రీమతి గజ్జెల మంజూష, నల్లాల రాజు, కొండ మహేష్ కుమార్, విద్యార్థినీ-విద్యార్థులు
మధ్యాహ్నం భోజన నిర్వాహకులు పాల్గొన్నారు.
