అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి:
పెద్దపల్లి పట్టణంలో నీ శాంతినగర్ ప్రాంతంలో క్యాన్సర్ తో బాధపడుతున్న MD జూబేద బేగం ను పరామర్శించి వైద్య ఖర్చుల కొరకు 5,000 రూపాయల ఆర్థిక సహాయం మరియు పండ్లు అందించి మానవత్వం చాటుకున్న టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల పౌండేషన్ వ్యవస్థాపకులు నల్ల మనోహర్ రెడ్డి
పెద్దపల్లి పట్టణ శాంతి నగర్ నిరుపేద కుటుంబానికి చెందిన MD జూబేద బేగం గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంది శాంతి నగర్ కు కు చెందిన స్థానిక యువత నాయకులు సమాచారం మేరకు వారి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించి వైద్య ఖర్చుల నిమిత్తం 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది ఈ సందర్భంగా నల్ల మనోహర్ రెడ్డి జూబేద బేగం ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు ఆరోగ్య పరిస్థితి త్వరగా మెరుగుపడాలని ఆకాంక్షించారు
