అగ్నిధారన్యూస్, పెద్దపల్లి జిల్లా… రాబోయే సాధారణ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా జిల్లాస్థాయిలో మండల స్థాయిలో వివిధ శాఖలో పనిచేస్తున్న అధికారుల బదిలీలు జరిగాయి అందులో భాగంగా పెద్దపల్లిలో జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేసిన చంద్రమౌళిని భద్రాది కొత్తగూడెం కి బదిలీ చేయగా….. జయశంకర్  భూపాల్ పల్లి జిల్లా పంచాయతీ అధికారిగా విధులు నిర్వర్తించిన ఆర్ ఏ ఎస్ పి లత పెద్దపల్లి జిల్లా పంచాయతీ అధికారిగా బుధవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పదవి బాధ్యతలు చేపట్టిన అధికారికి, డివిజనల్ పంచాయతీ అధికారి వేణుగోపాల్, అప్సర్, శిల్పా, రాములు, ఖదీర్, రజాక్, రవీందర్, తదితరులు శుభాకాంక్షలు తెలిపారు . ఈ సందర్భంగా DPO మాట్లాడుతూ.. జిల్లాలోని పంచాయతీలను అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి అందరి సమన్వయంతో ముందుకు తీసుకెళ్తానన్నారు.