అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్:

కొద్దిసేపటి క్రితం సుల్తానాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ ముత్యం సునీత భర్త అయిన ముత్యం రమేష్ గౌడ్ గుండెపోటుతో మరణించారు. సుల్తానాబాద్ మండలంలో బిఆర్ఎస్ క్రియాశీల సభ్యునిగా చిరకాల ముద్ర వేసుకున్నారు. బిఆర్ఎస్ పార్టీని ఆయన ముందుకు తీసుకెళ్లడంలో ఎంతో పాత్ర ఉందని పలువురు రాజకీయ నాయకులు అన్నారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.