పెద్దపల్లి బార్ అసోసియేషన్ నూతన అధ్యక్ష కార్యదర్శులు గా లకిడి భాస్కర్ ,కోటగిరి శ్రీనివాస్ ఎన్నిక……
అగ్నిధారన్యూస్, పెద్దపల్లి:
పెద్దపల్లి జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2024 25 సంవత్సరానికి గాను అధ్యక్ష కార్యదర్శులుగా లకిడి భాస్కర్ ,కోటగిరి శ్రీనివాస్ ఎన్నికైనట్లు ఎలక్షన్ అధికారి చంద మొగిలి పేర్కొన్నారు గురువారం సాయంత్రం జిల్లా కేంద్ర బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల్లో ఉపాధ్యక్షులుగా అల్లాడి ఫణి కుమార్, సంయుక్త కార్యదర్శిగా టి .అశోక్ లైబ్రరీ సెక్రటరీగా బొంకూరి సంతోష్, కోశాధికారిగా సురేందర్ గౌడ్, క్రీడా సాంస్కృతిక కార్యదర్శిగా బర్ల రమేష్ బాబు లు ఎన్నిక కాగా ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా పుట్ట రవికుమార్ ,ఆసరి రమేష్, వడ్లకొండ రమేష్ ఎన్నికయ్యారు వీరి ఎన్నిక పట్ల పలువురు సీనియర్ జూనియర్ న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.

