అగ్నిధారన్యూస్ పెద్దపల్లి
పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో 2022లో ఊర చెరువులో ఆరు ఇటుక బట్టీల యజమానులు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోగా వారికి మట్టి తవ్వకాలకు పరిమితులతో కూడిన అనుమతులు మే 2022లో ఇచ్చామని పెద్దపల్లి మైనింగ్ ఏడి శ్రీనివాస్ తెలిపారు. ఆనాడు తీసిన మట్టిలో అనేక అక్రమాలు జరిగాయని.. వివిధ మీడియాలో శుక్రవారం అక్రమ మట్టి కథనాలు వచ్చాయని అన్నారు. అక్రమంగా నిలువచేసిన మట్టి కుప్పలను సందర్శించామని తెలిపారు. నా సందర్శనలో అక్రమ మట్టి కుప్పలను గుర్తించామని, కోట్లాది విలువచేసి మట్టిని కుప్పలుగా ఉందని తెలిపారు. గతంలోని అక్రమంగా తీసిన మట్టికి. సుమారు రెండు కోట్ల రూపాయల అపరాధ రుసుము వేశామని తెలిపారు. 2023లో పెనాల్టీ చెల్లించాలని నోటీసులు ఇచ్చినప్పటికీ ఇంతవరకు అపరాధ రుసుము చెల్లించలేదని తెలిపారు. ఆరు మట్టి కుప్పలను గుర్తించామని అన్నారు. గుర్తించిన మట్టిని సీజ్ చేశామని తెలిపారు. అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక తయారు అవుతుందని అన్నారు.

హుండాయ్ టు టెన్ మిషన్ ని సీజ్ చేసామని ఎడి మైనింగ్ తెలిపారు.

